Monday, 7 September 2015

పాట నెం :35

ఎదురుచూపే చూస్తున్నా నువ్వస్తావనీ 
ఎదలో మదనే పడుతున్నా నిను చూడాలనీ 
నీ కోసమే నేనున్నది - నీవు లేనిదే నేను లేనులే 
నా ప్రాణం నీవేగా                               //ఎదురు//

నిన్ను చూడకుండా కంటికి నిద్దురే లేదులే 
నిన్ను మరువలేక మనసుకి మౌనమే ముచ్చటయ్యేనే
ఎవరు పిలుపు విన్నా -నీ పలుకే అనుకుంటున్నా 
ఎటువైపు నే చూస్తున్నా - నీ రూపమే కలగంటున్నా
ఎద పావురంలా ఎగురుతుందే - నిన్ను కలవటానికి   //ఎదురు//

నువ్వు పక్కన ఉన్నన్నాళ్ళు నాకు పొద్దే తెలియలేదే 
నా చెంతన నీవు లేక - కాలమే గడువదే 
ఆనాటి మన అలకలు -ఈనాటి జ్ఞాపకాలయ్యేనే 
ఆనాటి మన ముచ్చటలు - మూన్నాళ్ళ ఓదార్పుగా మారెనే 
తెలిసిందిలే తలపేమిటో - ప్రియా నీవు లేని భారం    //ఎదురు//


!!!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా 


No comments:

Post a Comment