Friday, 4 July 2025

లేక్షణ పాపా - HAPPY BIRTHDAY SONG

 అమ్ములమ్మలు

కోయిలమ్మలు
అందుకోరా నిండైన దీవెనలు

చిట్టి గుమ్మలు
చిన్ని కోనలు
ఎల్లప్పుడూ ఉండాలి హ్యాపీ క్షణాలు

మా కలల రాణివి, చిన్నారివి
మా ఇంటి మహారాణివి, మురిపానివి
మా ముద్దుల పాపాయివి
చందమామ రూపానివి

చేసుకోరా HAPPY BIRTHDAY
MANY RETURNS OF THE DAY //2//
అమ్ములూ...


నీ పలుకులు బంగారం
నీ నడకలో ఓ సింగారం
నీ అడుగుల సవ్వడే మాకు సంబరం

నీ సొగసు సుకుమారం
నీ చేష్టలలో చందమారం
నీ అల్లరి క్షణాలే మాకు మధురం

లేక్షణ పాపా, HAPPY BIRTHDAY
MANY RETURNS OF THE DAY //2//
అమ్ములూ...


నీ బుంగమూతి గారాభం
నీ బుజ్జగింపే మాకు వరం
నీ అలకల జావళి – ఓ మధుర గీతం

నీ ప్రేమంటే మాకిష్టం
నిన్ను ప్రేమించడమే మా అదృష్టం
మా ప్రపంచమే నీవే రా బంగారం

లేక్షణ పాపా, HAPPY BIRTHDAY
MANY RETURNS OF THE DAY //2//
అమ్ములూ...

Monday, 29 January 2024

నమస్సుమాల (62)

 ఓ బాలా - పాట


నమస్సుమాల..ఓ బాలా
బిడియం చాలించమ్మా
బెట్టు తగ్గించమ్మా
 తిట్టు పర్లేదమ్మా
నీపై ఒట్టు ఇది ప్రేమేనమ్మా
నీ చుట్టూ నే చక్కెర్లు కొట్టలేనమ్మా
నమస్సుమాల
చంపకమాల
చంపకే బాలా ..ఓ బాలా //నమస్సుమాల//


హల్లో డార్లింగ్ అంటావ్
ఆపై దబ్బేయ్ అంటావ్
ఏదో మాటుందంటావ్
పోటీ పడలేనంటావ్
చీటికి మాటికి ఎందుకే చెలియా
ఈ చిర్రు బుర్రులు
కోపావేషాల్ ఎందుకే మనకీ
ఆపే ఈ గుర్రు గుర్రులు

నా బాల మధుబాల
నువ్వేలా నా బాల చాలించు ఈ గోల   //నమస్సుమాల//


నేనే నీ వైఫ్ అంటావ్
నువ్వే నా లైఫ్ అంటావ్
నాతో పడలేనంటావ్
నన్నే ప్రేమిస్తుంటావ్
వహ్ వా ఏం ప్రేమంటావ్
వార్నింగ్ లు ఇస్తుంటావ్
ప్రతీ సారి ఎందుకే చెలియా
ఈ కవ్వింపులు
ప్రేమలో తప్పవుగా మనకి
ఈ లవ్వింగులు

నా బాల మధుబాల
నువ్వేలా  చాలించు ఈ గోల   //నమస్సుమాల//






Wednesday, 17 April 2019

పాట :61

పల్లవి :

పిలిస్తే పలుకుతావట
పిలిస్తే పలుకుతావట బాబా

ఒక్కసారి ... ఒక్కసారి ...
ఒక్కసారి కనపడగా రావా

అందరి బంధువు అంటారే .. అల్లా నీవే అంటారే
కరుణామయుడని అంటారే ... యేసుగా నిను కీర్తిస్తారే
రాముడు నీవే ,కృష్ణుడు నీవే .. మా భగవానువు నీవే
జీవుడు నీవే ,దేవుడు నీవే ... మా జీవనసత్యం నీవే నీవే

//పిలిస్తే //

చరణం 1:

మానవుడిగా జన్మించావే .. మహాయోగిగా మారావే
మహిమలెన్నో చూపావే ..మానవత్వం చాటావే

ప్రతీ ఇంట పటమై   వెలుగొందినావు
ప్రతీ గుండెలో కొలిచే రూపమయ్యావు

సమతా నీవే ,మమతా నీవే ..సర్వమత సారాంశం నీవే
సర్వం నీవే ,మర్మం నీవే ... భగవద్గీత అంశం నీవే

//పిలిస్తే //

చరణం 2:

సాధువుగా కనిపించావు  ...భిక్షపతిగా  జోలెత్తావు
మా పాపాలను హరించావు - సాయిలీలలతో ఆడావు

సత్యం నీవే ,ధర్మం నీవే - మా సత్యమార్గం నీవే
చరణం నీవే ,శరణం నీవే - మా సద్గురు సాయి నీవే

సాయివి నీవే ,హాయివి నీవే - మా షిరిడీ సాయివి నీవే నీవే
మా బాబా నీవే ,బంధం నీవే - శ్రీ సాయిబాబా నీవే నీవే




Friday, 20 October 2017

పాట నెం :60

పల్లవి :-

 గుండెను గాయం చేసి బండగా మారావా
ఇబ్బంది నువ్వూ పడుతూ తబ్బిబ్బయ్యావా  //గుండె //

కలలోనైనా కావ్యాన్ని చదివేస్తావు నాలా
ఇలలో నీ ముందుంటే బేలచూపులు ఏలా ?
నీతో గడిపిన  సావాసాన్ని చంపేస్తున్నావా
నాలో జ్వాలను రగిలించి జారిపోతావా     //గుండె //


చరణం 1:

ఆ చినుకే చెప్పింది మన నడకల గమనాన్ని
ఆ మేఘం చూసింది మన వలపుల గమకాన్ని

మన మనసులు మమేకమై రుచి చూసిన ప్రణయాన్ని
మరలా వద్దకు రావొద్దంటూ నిందించకు నా ప్రేమని

నీవే నేనై నేనే నీవై నాలో సగమై నిలచిన ప్రాణమా  //గుండె //


చరణం 2:

ఆ చిరుగాలి పాడింది తన స్వరాన్ని శృతి కలిపి
ఆ సెలయేరు పారింది మన సవ్వడితో కలిసి

మన హృదయం సరాగమై కురిసిందే అనురాగమే
నువ్వూ ఓ దూరమై మిగిలిందే ఆలాపనే


నీవే నేనై నేనే నీవై నాలో సగమై నిలచిన ప్రాణమా  //గుండె //









Tuesday, 14 February 2017

పాట నెం :59 (పేరడీ సాంగ్ )

సినిమా : ఖైదీ నెం -150
పాట : నీరు నీరు నీరు 

చారు చారు చారు
ఇది చింతపండు చారు
తాగకుండా ఉండేదెవ్వరూ
చింతపండు కలిపా
కరేపాకు నలిపా
రుచి చూడకుండా పోయేదెవ్వరూ
వండేవాడి గోడు
ఎవడు వింటాడు
ఆలోచించే  నాధుడెవ్వరు


చారు చారు చారు
ఇది చింతపండు చారు
తాగకుండా ఉండేదెవ్వరూ

గొంతు గరగర మంటే పేగు పెరపెర మంటే
ఈ కొత్త చారునారగించవోయ్
నీళ్లు లేకపోతే .... ఒళ్లు నీరు గారిపోతే
ఈ చారు కాస్త చప్పరించవోయ్
ముద్దపప్పు తోటి
సుష్టిగా నువ్వు తింటే
ఆ పూటంతా గుప్పుగుప్పునా


చారు చారు చారు
ఇది చింతపండు చారు
తాగకుండా ఉండేదెవ్వరూ
చింతపండు కలిపా
కరేపాకు నలిపా
రుచి చూడకుండా పోయేదెవ్వరూ
వండేవాడి గోడు
ఎవడు వింటాడు
ఆలోచించే  నాధుడెవ్వరు



Tuesday, 27 December 2016

పాట : 58

పల్లవి :-

నా దేవత నీవే నా దెయ్యం నీవే
నాలో కలతా నలతా నీవే
నా అరుణం నీవే దారుణం నీవే
నే తీర్చుకోలేని రుణం నీవే
ఉప్పెనలా ఉప్పొంగేది నీవే -చినుకులా సృశించేది నీవే
హోరుగాలిలా భయపెట్టేది నీవే -చిరుగాలిలా సేద తీర్చేది నీవే
నీవే నీవే నీవే - నా ఆరోప్రాణం నీవే
నీవే నీవే నీవే - నా ఆరడుగుల జీవం నీవే          // నా దేవత //

చరణం 1 :



Wednesday, 30 November 2016

పాట :57

ఏం తినేటట్టు లేదు
ఏం కొనేటట్టు లేదు
నాగులో నాగన్నా  //2//

ప్రభుత్వపు మెరుపుదాడి
సామాన్యుడి కంటతడి
నాగులో నాగన్నా  //2//

కొత్త 2000 నోటంటూ
మా కొంప ముంచెనన్నా
నాగులో నాగన్నా  //2//

పాత నోట్లన్నీ రద్దంటూ
చెల్లని నోట్లు వద్దంటూ
నాగులో నాగన్నా  //2//

100 రూ //లు జేబునుంటే
పూట మొత్తం గడవాలన్నా
నాగులో నాగన్నా  //2//

నల్ల కుభేరుల మాటేమిటో
ఎండుచేపల బ్రతుకాయే
నాగులో నాగన్నా  //2//

డిపాజిట్లు అంటారు
విత్ డ్రా అంటారు
షరతులెన్నో పెడతారు
నాగులో నాగన్నా  //2//

ఎంత సొమ్మైనా జమచేయి
పైసా తీయుటకు రాదోయి
నాగులో నాగన్నా  //2//

బ్యాంక్ లలో క్యూ లైన్లు
ఎటిఎం లో నో క్యాష్
నాగులో నాగన్నా  //2//

ఎంతకాలం జాతర
మా పనులన్నీ మూత రా
నాగులో నాగన్నా  //2//

ఆయాసం వచ్చేరా
అలసిపోతుంటామురా
నాగులో నాగన్నా  //2//

నల్లధనం ఆగినదా
మూలధనం కదిలినదా
నాగులో నాగన్నా  //2//

చిల్లర దొరకక
ఉన్న నోటు చెల్లక
నాగులో నాగన్నా  //2//

బడా బాబులకే సర్వీసులు
సామాన్యుడికి బే ఖాతరు
నాగులో నాగన్నా  //2//


దేశమంతా కమీషన్ల ఏజెంట్లు
బ్యాంక్లలో పైసా లేదు ఏమంటారు ?
నాగులో నాగన్నా  //2//


చిన్న చిన్న వారికి చిల్లు జేబులు
పెద్ద పెద్ద వారికి పొర్లు దండాలు
నాగులో నాగన్నా  //2//

మోడీ సారు మీ నిర్ణయం సూపరు
వసతులు సమకూర్చితే అది బెటరు

నాగులో నాగన్నా  //2//