Sunday, 25 October 2015

పాట నెం :53


ఎక్కడ నుంచి వచ్చింది కందిరీగ 
నన్ను ఇలా కుట్టింది తొందరగా 
ఒక్క చూపుతో నన్ను చుట్టేసింది 
ఒక్క సిగ్నల్ తో చిత్తు చేసింది 
అలా వచ్చి ఇలా గిచ్చి నా మనసు దోచి 
అల్లకల్లోలం చేసేసింది 
నన్ను అయోమయంలో పడవేసింది 

మొదటసారి చూసాను 
మొహమాటం విడిచాను 
మాట మాట కలిపాను 
మాటల్లో అడిగాను 

ఏమని ?

నచ్చానా నేను నీకని 
మరి పెంచనా నా బైకు స్పీడుని 

మరి తానేమంది ?

అమాంతంగా హత్తుకుపోయింది 
సిగ్గుతోటి మురిసిపోయింది 
గ్రీన్ సిగ్నల్నే గ్రీన్ సిగ్నల్నే 
గ్రీన్ సిగ్నల్నే నాకు ఇచ్చేసింది 
ఇకపైనా ఇంట్లో మాట్లడమంది 

తర్వాత ఏమి జరిగింది ?

నైటు అంతా నిద్దుర లేదు 
తిందామంటే ఆకలి లేదు 
ఆలోచనలతో హాట్ అయ్యాను 
మరో ఉదయం కోసం ఎదురు చూసాను 

మరి తనకి కూడా అలానే ఉందా ?
అంతేగా మరి.........

ఉన్నపాటుగా ఏదో తోడూ నన్ను కోరినట్టుగా 
నాకు కూడా మరోలోకం అన్నీ తానైనట్టుగా 
ఆనందం  చిందులు వేసింది 
ఆ క్షణం హాయని పించింది 

మరి ఇంట్లో చెప్పాలిగా ?
ఎందుకు చెప్పలేదు చెప్పాను ......

హార్ట్ టచ్ అంటే ఏమిటో 
ఇప్పుడే చూశానని 
చేసుకుంటే తనకే నేను 
ఫిక్స్ అయ్యానని 

మరి వాల్లెమన్నారు ?

మీకిష్ట మయితే మాదేముంది 
మంచిరోజులు ముందర వుంది 
అప్పటిదాకా ఆగండండి 
ఈలోపు ఒకరికొకరు అర్డంకండి 

మరి వాట్ నెక్స్ట్ బాస్ ?

ఇంకేముంది 
ప్రస్తుతానికి ఇంటర్వెల్ 
త్వరలో వస్తుంది శుభం కార్డ్ 

///////////////////
గరిమెళ్ళ రాజా  

Wednesday, 14 October 2015

పాట నెం :52

పల్లవి :

తుళ్లీ తుళ్లీ పడకు మనసా 
నువ్వు మళ్లీ మళ్లీ పడకు మనసా 
రెక్కలొచ్చాయని -ఎగిరిపోకు 
దెబ్బ తగిలిందని - దిగులు పడకు 
సాగిపోవాలని - ఆశ పడకు 
ఉండిపోవాలని - కలలు కనకు     //తుళ్లీ తుళ్లీ //


1 చరణం :

సంతోషం సగం దూరమే 
భాదైనా కొంత భారమే 
రెంటిలో ఏదీ నిలువదు మనసా 
అవి రెండూ ఎండమావులే మనసా    //తుళ్లీ తుళ్లీ //

2 చరణం :

సుఖమన్నది వస్తూ ఉంటది 
కష్టమన్నది పోతూ ఉంటది 
కలకాలమేమి ఉండలేవులే మనసా 
అవి రెండూ తల్లి బిడ్డలే మనసా      //తుళ్లీ తుళ్లీ //

3 చరణం :

తీపి అన్నది హాయినిస్తది 
చెడు అన్నది వికటిస్తది 
తీపి చేదు కలయికే జీవితం 
బ్రతుకు బండికి రెండూ అవసరం మనసా    //తుళ్లీ తుళ్లీ //


4. చరణం :



Thursday, 1 October 2015

పాట 51

నన్ను కాదని ,వల్లకాదని -వెళ్ళిపోతుంది నిమిషం

నిన్న చూడని ,చందమామని - చూపనంటుంది నిమిషం
స్నేహం చేరనంటోంది
ప్రేమ పుట్టనంటోంది
ఇష్టం మిగిలిపోతోంది
మౌనమై దహించివేస్తోంది

ఏమంత ఏకాంతం కన్నెర్ర చేస్తుంది
నా చెంత ఏ సొంతం సరితూగ లేనంది                         //నన్ను కాదని //