పాట నెం :50
పల్లవి :
ఎవ్వరివో నువ్వెవరివో ఎవ్వరివో నా సుందరివో
నా కన్నులవో నా కౌగిలివో కమ్మగా కదిలే నా కలవో
సాగర తీరాన విరబూసే వెన్నెలవో
కోకిలగానంతో పలకరించే ఆమనివే
ఏమి నువ్వో ఎవ్వరివో దివి నుంచి వచ్చిన తారకవో
ఏమి నువ్వో ఎవ్వరివో నాకై పుట్టిన గోపికవో //ఎవ్వరివో //
చరణం 1 :
మెరుపులా వచ్చి , మనసునే తట్టి - నన్ను నిద్ర లేపిన రాక్షసివో
ఉప్పెనై వచ్చి , నా గుండెలో దాగి - గుడిగంట కొట్టే ప్రేయసివో
నా చుట్టూ చేరి ,కనికట్టు చేసి - కనిపించ తిరిగే నా మాయవో
నా భారమై , నా తీరమై - నువ్వు దూరమై
నా ధ్యానమై , నా గమ్యమై - నువ్వు రమ్యమై
ఎవ్వరివో ఎవ్వరివో నన్నిలా చేసావో
ఎవ్వరివో ఎవ్వరివో నన్ను మార్చావో //ఎవ్వరివో //
చరణం 2 :
చిరుగాలిలా చేరి , పరిహాసమే ఆడి - పరుగులు పెట్టించే తుమ్మెదవో
చినుకులా వచ్చి , వరదనే తెచ్చి - వలలో బందించే జాలరివో
నాలోన చేరి , నాలోన దాగి - అల్లరిని పుట్టించే తిమ్మిరివో
నా గానమై , నా గర్వమై - నువ్వు గగనమై
నా ప్రాణమై ,నా సర్వమై - నువ్వు బంధమై