Tuesday, 27 December 2016

పాట : 58

పల్లవి :-

నా దేవత నీవే నా దెయ్యం నీవే
నాలో కలతా నలతా నీవే
నా అరుణం నీవే దారుణం నీవే
నే తీర్చుకోలేని రుణం నీవే
ఉప్పెనలా ఉప్పొంగేది నీవే -చినుకులా సృశించేది నీవే
హోరుగాలిలా భయపెట్టేది నీవే -చిరుగాలిలా సేద తీర్చేది నీవే
నీవే నీవే నీవే - నా ఆరోప్రాణం నీవే
నీవే నీవే నీవే - నా ఆరడుగుల జీవం నీవే          // నా దేవత //

చరణం 1 :



Wednesday, 30 November 2016

పాట :57

ఏం తినేటట్టు లేదు
ఏం కొనేటట్టు లేదు
నాగులో నాగన్నా  //2//

ప్రభుత్వపు మెరుపుదాడి
సామాన్యుడి కంటతడి
నాగులో నాగన్నా  //2//

కొత్త 2000 నోటంటూ
మా కొంప ముంచెనన్నా
నాగులో నాగన్నా  //2//

పాత నోట్లన్నీ రద్దంటూ
చెల్లని నోట్లు వద్దంటూ
నాగులో నాగన్నా  //2//

100 రూ //లు జేబునుంటే
పూట మొత్తం గడవాలన్నా
నాగులో నాగన్నా  //2//

నల్ల కుభేరుల మాటేమిటో
ఎండుచేపల బ్రతుకాయే
నాగులో నాగన్నా  //2//

డిపాజిట్లు అంటారు
విత్ డ్రా అంటారు
షరతులెన్నో పెడతారు
నాగులో నాగన్నా  //2//

ఎంత సొమ్మైనా జమచేయి
పైసా తీయుటకు రాదోయి
నాగులో నాగన్నా  //2//

బ్యాంక్ లలో క్యూ లైన్లు
ఎటిఎం లో నో క్యాష్
నాగులో నాగన్నా  //2//

ఎంతకాలం జాతర
మా పనులన్నీ మూత రా
నాగులో నాగన్నా  //2//

ఆయాసం వచ్చేరా
అలసిపోతుంటామురా
నాగులో నాగన్నా  //2//

నల్లధనం ఆగినదా
మూలధనం కదిలినదా
నాగులో నాగన్నా  //2//

చిల్లర దొరకక
ఉన్న నోటు చెల్లక
నాగులో నాగన్నా  //2//

బడా బాబులకే సర్వీసులు
సామాన్యుడికి బే ఖాతరు
నాగులో నాగన్నా  //2//


దేశమంతా కమీషన్ల ఏజెంట్లు
బ్యాంక్లలో పైసా లేదు ఏమంటారు ?
నాగులో నాగన్నా  //2//


చిన్న చిన్న వారికి చిల్లు జేబులు
పెద్ద పెద్ద వారికి పొర్లు దండాలు
నాగులో నాగన్నా  //2//

మోడీ సారు మీ నిర్ణయం సూపరు
వసతులు సమకూర్చితే అది బెటరు

నాగులో నాగన్నా  //2//



















Monday, 28 November 2016

పాట : 56

పల్లవి 
మనసు  కోతి గెంతుతూ ఉంటుంది
భయట నీతి చూపిస్తూ ఉంటుంది
నమ్మమని చెబుతూ ఉంటుంది
నమ్మేట్టు కనపడకుంటుంది
ఒక చోట బొమ్మలా ఉంటుంది
మరో చోట బొరుసులా ఉంటుంది     // మనసు //

 చరణం 1:
వర్ణనకి అందమైనది మనసు
దాని భాష ఎవ్వరికి తెలుసు
మంచిని పాటించే మనసు
చెడుకి లొంగిపోయే మనసు
మానవత్వం ఉన్న మనసు
క్రూరత్వం కూడా తెలుసు
ఒక చోట ఉండదు కుదురుగా
డాబుని చూపును బేషుగ్గా        // మనసు //


చరణం 2 : -

ప్రశ్నలు సందిస్తుంది మనసు 
జవాబు లేదంటుంది మనసు 
సూటిగా స్పందిస్తుంది మనసు 
చాటుగా కవ్విస్తుంది మనసు 
దాపరికం దాని నైజం 
గజి బిజీ చెయ్యటం మనసు ఇజం 
ఆపినా ఆగదు మనసు 
చెప్పినా వినడు మనసు  //మనసు //

- గరిమెళ్ళ గమనాలు // 29. 11. 2016// 








Thursday, 10 November 2016

పాట : 55

సాయి నామము  శ్రీ సాయి రూపము 
అమరము అద్భుతము  ఆనందదాయకం 

సాయి స్మరణము  శ్రీ సాయి చరణము 
రమ్యము  భవ్యము  జన్మపావనం 

సాయి కీర్తనం   శ్రీ సాయి చరితం 
అర్పితం  అర్జితం  అజరామృతం 

సాయి లాలన  శ్రీ సాయి దీవెన
శరణము  శ్రావ్యము భక్తి పరవశం 

సాయి   దీక్షితం శ్రీ సాయి దర్శనం 
నిదర్శనం  ప్రదర్శనం ముక్తిధామం 

Sunday, 29 May 2016

పాట : 54

చిన్న పాట ... చాలా రోజుల తర్వాత 



పల్లవి :


నిదురే రాదు నిన్ను చూడక 

నిముషం అయినా నిన్ను వీడక 
ఉండనంటున్నది మనసే 
మాననంటున్నది తపస్సే 

ఏకాంతమే ఊగిపోతున్నది 

నీ తలంపులో తేలిపోతున్నది .....    //నిదురే //


చరణం 1:


ఎంతెంత దూరం 

మన కలలకు విడ్డూరం 
ఇంకెంత దూరం 
నిన్ను చేరు తరుణం 

ఈ దూరమెంత భారం 

మన ప్రేమకు శ్రీకారం 
పుంజుకుంటూ  వేగం 
మన మనసు గాలి వేగం 

ఆకాశమే అవనిని దాటి 

ఆనందమే వరమును తెచ్చి 
ఇద్దరినీ దరికి చేర్చే క్రమములో .....   లో లో  ///నిదురే //