Monday, 22 December 2014

పాట నెం :8

పల్లవి :

ప్రేమా నిన్ను ప్రేమించినా
ప్రేమయే  కనిపించునా ?
ప్రేమా నిన్ను పూజించునా
ప్రేమయే ఫలించునా ?
ప్రేమ పేరుతో కదులుతున్న కధలెన్నో
ప్రేమ మాయలో మునుగుతున్న వ్యధలెన్నో
అది నీకే తెలుసు - మా గతి ఎవరికి తెలుసు    //ప్రేమా //

చరణం 1:-
`

Tuesday, 16 December 2014

పాట నెం :7

ఈ టివి 2 వారికోసం వాలెంటైన్స్ డే సందర్భంగా నా రెండవ పాట 

తన ప్రియురాలు కొన్ని రోజుల తర్వాత తన కోసం తిరిగి వచ్చిన క్షణం లో 

ప్రియుడు  పాడుకునే ఈ పాట 
***********************************************************************************************************************************
నిన్ను చూడగానే గుండెస్పందన మొదలాయె
నీ రాకతోటే మనసుహాయి తెలిసిందే
నీ వాలుచూపుల్లో నా తలపు మురిసిందే
నీ చిరునవ్వుల్తో నా గుండెగంట మ్రోగిందే
ఓ చెలీ ఓ చెలీ ఓ చెలీ .......... ... వెన్నెల్లో జాబిల్లి
ఓ చెలీ ఓ చెలీ ఓ చెలీ........... ... నా కన్నుల్లో దీవాళీ    //నిన్ను చూడగానే //

చరణం 1 :-
కలవరింతలకు కాలం చెల్లిపోయే
కమ్మనైన నీ శ్వాస గంధమై చేరే
ఏ తుళ్ళింతలు ఇక నన్ను చేరలేవే
నీ అడుగుల సవ్వడే నా గమ్యమాయే
నీ పిలుపు చాలు అది పంచదార పలుకు
నీ ఉనికి చాలు అది నన్ను మేలుకొలుపు  

ఓ చెలీ ఓ చెలీ ఓ చెలీ .......... ... వెన్నెల్లో జాబిల్లి
ఓ చెలీ ఓ చెలీ ఓ చెలీ........... ... నా కన్నుల్లో దీవాళీ    //నిన్ను చూడగానే //

చరణం 2: -

ఊహలతో ఇక నాకు పనిలేదాయే
ఊపిరల్లే  నీ రూపం నాలో నిలచిపోయే
ఎక్కిళ్ల తిప్పలు  అవసరం లేదే
ఎదురుగా నువ్వుంటే నాకది చాలే
నీ చూపు చాలు అది వలపులాంటి చినుకు 
నీ స్పర్శ చాలు అది నా ప్రాణాన్ని నిలుపు 

ఓ చెలీ ఓ చెలీ ఓ చెలీ .......... ... వెన్నెల్లో జాబిల్లి
ఓ చెలీ ఓ చెలీ ఓ చెలీ........... ... నా కన్నుల్లో దీవాళీ    //నిన్ను చూడగానే //

Saturday, 6 December 2014

పాట నెం :6

పల్లవి :  
నీ నగుమోము నడుస్తుంది నా ఊహల్లో
నీ వలపేమో తడుస్తుంది నా తలపుల్లో
ఎంత వేచినా , ఎంత చూచినా
తనివి తీరని తాపమే
మొహమై మదిలో మొదలాయే                                   //నీ నగుమోము //

చరణం1 :
నీతో గడిపిన నిముషం
నిలువెల్లా చూపించే నీ రూపం
మరువనే మరువదు జ్ఞాపకం
మదినంతా మేల్కొలిపే కలవరం
 ఏ చోటున్నా ,నీ పాటేగా
  ప్రేమగానమై వినిపించెగా                                      //నీ నగుమోము //

చరణం 2:
నేను నీవైన ఆ క్షణం
 నింగి నేల కలిసినని ఓ  భావం
 వీడలేదు నన్ను నీ ప్రేమ
ఏడ చూడలేని గొప్ప హంగామా
ఏ చోటున్నా , నీ ద్యాసేగా
 ప్రేమదాసున్ని అయ్యానిలా                                 //నీ నగుమోము //

Monday, 1 December 2014

పాట నెం :5

పల్లవి : 
ఆనందం అదిరింది 
ఆహ్వానం అందింది 
అందరి ఎదనే తాకింది 

అల్లరినే చేసింది 
ఆత్మీయత పంచింది 
ఎంతో అందంగా ఉంది 

మది సంబరమే అంబరమై
సరదాలు తిరిగే బొంగరమై 
మేళ తాళాలు మధురంగా మ్రోగగా 
సాహితీ సమ్మేళనం పండే తీయగా                  //ఆనందం //


చరణం 1 :
ఎందరెందరో ఎక్కడినుంచో వచ్చేసారండి 
అందరు కలిసి ఒక్కరిలాగా కదిలొచ్చారండి 
వేష ,భాషలన్నీ కలిసి వేడుక చేసాయి 
కుల ,మతాలు పక్కనపెట్టి సందడి తెచ్చాయి 
ఆనందం అందరి గుండెకు దండం పెట్టింది 
అనుభంధం అన్యోన్యంగా స్వాగతమిచ్చింది        //ఆనందం //


చరణం 2 :
అమ్మలక్కలు ఆడుతు పాడుతూ అలరించేసారు 
అబ్బాయిలు వారి గాత్రాన్ని ఝురిపించేసారు 
చిన్న ,పెద్ద అని మరచి చిందులు వేసారు 
చిరాకులు లేకుండా చిరునవ్వై మెరిసారు 
ఆనందం తాండవం చేస్తూ దండోరా వేసింది 
ఆప్యాయత అమ్మగా మారి వండర్ చేసింది      //ఆనందం//

Thursday, 7 August 2014

పాట నెం :4

ఒక మంచి పిల్లోడు 
_______________

ఓ యండురు యవ్వన వీణ 
నిను చూసి పడిపోయానా 
నీతోనా నేనేనా ఈ రోజునా 
ఉన్నానా కలగన్నాన అనుకున్నాన 
అని ఆలోచిస్తుంటే నిజమని తెలిసింది 
నీతోనా నా కాలం  పయనం చేస్తుంది 
అది నిన్నే ప్రేమించేస్తుంది               

నీలోన లక్ష్మీ కల చూసి 
నా మనసు నిన్నే లవ్ చేసి 
నిజాయితీగా నిన్ను ఫాలో చేసి 
నీలోన సరిగమలు కదిలించి 

లగ్గమాడాలని నిర్ణయించి 
లఘ్న పత్రికలను రాయించేసి 

నీతో మంచిపిల్లోడని అనిపించేసి 
హ్యాపితో హారికనే నవ్వించేసి 

జూలూరి పేరునే నీకు తగిలించి 
జులాయిగా నీ ప్రేమను గెలిచి 

పరిణయ మాడాను పిల్లా  నిన్ను 
నీ ప్రాణంగా చేసావు నా మది ఇల్లు 

నీతోటి జీవితం కొత్త వసంతంగా 
నీతో కదిలే అడుగులే నా గమ్యంగా 
నువ్వంటే నాకు అపురూపంగా 
నువ్వు నాలో సగ భాగంగా 

ఒక సంవత్సరం గడిచింది సంతోషంగా 
మరో వత్సరం రావాలి ఆహ్వానంగా 

పదికాలాలు పండాలి బంగారంగా 
పంచభూతాలు ఉండాలి మనకండగా 

ఈ సురేషు నీ చెంత సుకుమారంగా 
నీ మెడలో మాంగళ్య హారంగా 

మరోజన్మకు కూడా మమకారంగా 
మనుగడ సాగించేద్దాం అమృతంగా 

****************************
మొదటి వివాహ వార్షికోత్సవ శుబాకాంక్షలు తెలియచేస్తూ
 నా మది సంబరాన్ని నీతో పంచుకుంటూ 

- జూలూరు సురేష్ 






Monday, 21 April 2014

పాట నెం :3
పల్లవి :
తెల్లవారుజామున నా గుండె ఆగిపోయినా
చంద్ర బింబమల్లే నువ్వు నాకు కనపడినా
ఆ సూర్యదేవుడైనా స్వాగత మనేగా
నీ మేలి సొగసులతో తను వెలుగును పంచేగా
నువ్వు నాకు వరమే ఓ సిరిమల్లి
ఆ నింగి నుండి దిగి రాదా ఆ జాబిల్లి
శతకోటి వర్ణాలే చినుకులుగా చేరి
సుస్వాగతం పలికే నాట్యముగా మారి  //తెల్లవారు// 

చరణం1 :-
   నువ్వుంటే వసంతమే నడిచొస్తుంది 
   నువ్వుంటే మందారమే విరబూస్తుంది 
   మిల మిల మెరిసే తారల కన్నా
  నీ మోమున పండే నవ్వులు మిన్నా
  నా కన్నా నా చిన్నా నువ్వేలే కన్నూ మిన్నా  //తెల్లవారు//

చరణం2 :-
2) నీకోసమే ఈ పుడమి అవతరించింది 
   నీ కోసమే పారిజాతం పరిమళిస్తుంది 
   సంగీతంలో సరిగమ కన్నా 
  నీ పేరులో ఉన్నా మధురిమ మిన్నా 
  నీవేలే నాగానం నా గాత్రం నీవే నీవే                 // తెల్లవారు//
చరణం3 :-
3) నువ్వుంటే ఆనందమే హర్షిస్తుంది 
   నువ్వుంటే మన బంధమే అందమౌతుంది 
   ఏడెనిమిది జన్మలు ఉన్నా 
   ప్రతి జన్మకు నిన్నే కోరుకుంటున్నా 
   నా కున్న నా ప్రాణం నా రూపం నువ్వే నువ్వే  //తెల్లవారు //
                                               - రచన & గానం : రాజేంద్ర ప్రసాదు 

Tuesday, 11 March 2014

పాట నెం :2

చేయి చేయి కలుపు
ఇది ''మా ఆసరా '' పిలుపు
ఒక్కసారి నీ చూపు త్రిప్పు
ఆపన్నులున్న సమాజం వైపు

మొదటి అడుగు ఎవరిదంటే నీ పాదం కదుపు
తుదకు నీకు బానిసై చేరుకోదా గెలుపు     //చేయి//


ఎవరో ,నీవెవరో  ఇక మునుపు
అడుగు ,ప్రతి అడుగు మన మలుపు
తట్టండిరా ప్రతి మనసు తలుపు
స్వార్ధ రహిత సమాజమే మన పిలుపు

మొదటి అడుగు ఎవరిదంటే నీ పాదం కదుపు
తుదకు నీకు బానిసై చేరుకోదా గెలుపు     //చేయి//

అలుపెరుగక సాగాలి నీ తలంపు 
ఆలోచన నివ్వాలి నీ పిలుపు 
చైతన్యాన్ని మేలు కొలుపు 
రధ సారదివై నీ అడుగు కదుపు  

మొదటి అడుగు ఎవరిదంటే నీ పాదం కదుపు
తుదకు నీకు బానిసై చేరుకోదా గెలుపు     //చేయి//

కర్తవ్యబాటలో కదలాలి మనము 
మానవత్వంలో ఎదగాలి మనము 
సమాజశ్రేయస్సు కోసమే మనము 
''మా ఆసరా'' కలల వారసులమై మనము 

మొదటి అడుగు ఎవరిదంటే నీ పాదం కదుపు
తుదకు నీకు బానిసై చేరుకోదా గెలుపు     //చేయి//



Monday, 24 February 2014


పాట నెం : 1

పల్లవి :-
మరువకు నన్నే మరువకు
ఉండకు మాట్లాడక ఉండకు
నేనున్నదే నీ కొరకు
నువ్వున్నదే నా కొరకు

వెయ్యకే చురుకు

ఆపవే ఉరుకు

కుక్కు రుక్కూ ..................  // మరువకు //


చరణం 1 :

ఛీ పో అంటే చిరాకా
రా వే అంటే అలకా
ఏమిటే నీ తిక్కా
అర్ధం కాదు ఒక పక్కా

నేనున్నాగా ఎంచక్కా

మరి నువ్వెందుకు డీలాగా
ఏమన్నానని అంతగా
ఫీలైపోతావ్ వింతగా

విసరకే చూపు

రేపకే కైపు

కుక్కు రుక్కూ ........           // మరువకు //


చరణం 2 ;-

హలో అంటే వినవా
ఫాలో కమ్మని అనవా
ఏదో ఒకటి చెప్పవా
ఎందుకు మనకీ గొడవా

నేనంటేనే పడదా

నా మీద ప్రేమ లేదా
నువ్వంటే నాకు సరదా
నువ్వేలే నాకు రాధా

వెళ్ళకే నువ్వు

చంపకే నన్ను

కుక్కు రుక్కూ ..................... //మరువకు //