Monday, 7 September 2015

పాట నెం :41

ఏమాయో చేసావే 
మైకంలో దించావే
నట్టేటా ముంచావే 
నెరజాణ
సంకెళ్ళు వేసావే 
బందాన్ని పెంచావే 
బహుదూరం అయ్యవే 
జానే జాన 
నిన్ను చూసిన క్షణాన - నీవే లోకం అన్నా 
నీ మాటలుతోనే - కాలం గడవాలన్నా
రెప్పపాటునే కాలమనీ తెల్చేసావే 
జానే జానా - నెరజానా 

ఊహించానే ఊహలసుందరి 
వెన్నెల జాబిలి నీవని 
కవ్వించావే కన్నెల ఆమనీ 
కాలాతీతం నేననీ 
ఊసులు ఎన్నో ఉసిగోల్పావే 
నీ చుట్టూ నన్నే తిప్పించావే 
క్షణమైనా తోడులేననీ 
నేనున్నా చోటులేదనీ 
నిలిపావే నన్నీ నీ మదిలో 
ఊపిరినే పోసావే - నా శ్వాసలో 

ప్రేమించావే ప్రేమమయూరి 
నా ప్రానదేవతే  నీవనీ 
మనసిచ్చావే మందాకినీ 
నీ అదృష్టమే నేననీ 
నీ ప్రేమ దారలో బ్రతికించావే
నీ ప్రేమతో నన్నే మార్చేసావే 
ఏకాంతం అడ్డుకాదని 
నా సొంతం నీవే అన్నది

!!!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా





No comments:

Post a Comment