Monday, 7 September 2015

పాట నెం :45

తెలుపవే మనసా మదిలో ఈ మౌనం
చేరుపకే మనసా చెలియ చిరు జ్ఞాపకం
ఏమంటున్నా నేనేమంటున్నా నా నోటి మాటే నాకు తెలియదంటున్నా
ఎం చేస్తున్నా నేనేమ్చేస్తున్నా నే చేసేదేదో నాకే అర్ధం కాకున్నా
దిగులు దిగులుగా , గుబులు గుబులుగా 
కారుమబ్బులలో కమ్మింది నా హృదయమే 
చిన్న జాడైనా తెలియని చిమ్మ చీకట్లే 

ఓ ఓ ఓ......ఓ ఓ ఓ .....ఓ ఓ ఓ..... ఓఓఓ

నేస్తమా నువ్వన్నది నిజమేనా 
ఆ నిజములో నేనున్నది భ్రమయేనా 
మన ఇద్దరి మద్యన ప్రేమన్నది ఏమవునా
ఇష్టమంటూ వచ్చి నీవు ఇచ్చిపుచ్చుకున్నావు
కష్టమెంత ఉన్న కానీ ,కాలంతో నడిచాము
నా లోనే ఉన్నావు నా తోనే ఉంటానన్నావు
నీ తోడై ఉంటానంటూ - నీడల్లే కనుమరుగయ్యావు
కురిసినవి కన్నీళ్ళే కడగల్లుగా
మిగిలినవి ఎదలోతుల్లే ఎండమావులుగా
తిరిగిరాని తీరనివేదన 
మరచిపోని ఒకటే రోదన
ఆశతో సాగుతున్న నీకై శోదన 
ఎందుచేతా .....ఎందుచేతా
ఓ ఓ ఓ......ఓ ఓ ఓ .....ఓ ఓ ఓ..... ఓఓఓ

No comments:

Post a Comment