పాట నెం :3
పల్లవి :
తెల్లవారుజామున నా గుండె ఆగిపోయినా
చంద్ర బింబమల్లే నువ్వు నాకు కనపడినా
ఆ సూర్యదేవుడైనా స్వాగత మనేగా
నీ మేలి సొగసులతో తను వెలుగును పంచేగా
నువ్వు నాకు వరమే ఓ సిరిమల్లి
ఆ నింగి నుండి దిగి రాదా ఆ జాబిల్లి
శతకోటి వర్ణాలే చినుకులుగా చేరి
సుస్వాగతం పలికే నాట్యముగా మారి //తెల్లవారు//
చరణం1 :-
నువ్వుంటే వసంతమే నడిచొస్తుంది
నువ్వుంటే మందారమే విరబూస్తుంది
మిల మిల మెరిసే తారల కన్నా
నీ మోమున పండే నవ్వులు మిన్నా
నా కన్నా నా చిన్నా నువ్వేలే కన్నూ మిన్నా //తెల్లవారు//
చరణం2 :-
2) నీకోసమే ఈ పుడమి అవతరించింది
నీ కోసమే పారిజాతం పరిమళిస్తుంది
సంగీతంలో సరిగమ కన్నా
నీ పేరులో ఉన్నా మధురిమ మిన్నా
నీవేలే నాగానం నా గాత్రం నీవే నీవే // తెల్లవారు//
చరణం3 :-
3) నువ్వుంటే ఆనందమే హర్షిస్తుంది
నువ్వుంటే మన బంధమే అందమౌతుంది
ఏడెనిమిది జన్మలు ఉన్నా
ప్రతి జన్మకు నిన్నే కోరుకుంటున్నా
నా కున్న నా ప్రాణం నా రూపం నువ్వే నువ్వే //తెల్లవారు //
- రచన & గానం : రాజేంద్ర ప్రసాదు
పల్లవి :
తెల్లవారుజామున నా గుండె ఆగిపోయినా
చంద్ర బింబమల్లే నువ్వు నాకు కనపడినా
ఆ సూర్యదేవుడైనా స్వాగత మనేగా
నీ మేలి సొగసులతో తను వెలుగును పంచేగా
నువ్వు నాకు వరమే ఓ సిరిమల్లి
ఆ నింగి నుండి దిగి రాదా ఆ జాబిల్లి
శతకోటి వర్ణాలే చినుకులుగా చేరి
సుస్వాగతం పలికే నాట్యముగా మారి //తెల్లవారు//
చరణం1 :-
నువ్వుంటే వసంతమే నడిచొస్తుంది
నువ్వుంటే మందారమే విరబూస్తుంది
మిల మిల మెరిసే తారల కన్నా
నీ మోమున పండే నవ్వులు మిన్నా
నా కన్నా నా చిన్నా నువ్వేలే కన్నూ మిన్నా //తెల్లవారు//
చరణం2 :-
2) నీకోసమే ఈ పుడమి అవతరించింది
నీ కోసమే పారిజాతం పరిమళిస్తుంది
సంగీతంలో సరిగమ కన్నా
నీ పేరులో ఉన్నా మధురిమ మిన్నా
నీవేలే నాగానం నా గాత్రం నీవే నీవే // తెల్లవారు//
చరణం3 :-
3) నువ్వుంటే ఆనందమే హర్షిస్తుంది
నువ్వుంటే మన బంధమే అందమౌతుంది
ఏడెనిమిది జన్మలు ఉన్నా
ప్రతి జన్మకు నిన్నే కోరుకుంటున్నా
నా కున్న నా ప్రాణం నా రూపం నువ్వే నువ్వే //తెల్లవారు //
- రచన & గానం : రాజేంద్ర ప్రసాదు