Wednesday, 17 April 2019

పాట :61

పల్లవి :

పిలిస్తే పలుకుతావట
పిలిస్తే పలుకుతావట బాబా

ఒక్కసారి ... ఒక్కసారి ...
ఒక్కసారి కనపడగా రావా

అందరి బంధువు అంటారే .. అల్లా నీవే అంటారే
కరుణామయుడని అంటారే ... యేసుగా నిను కీర్తిస్తారే
రాముడు నీవే ,కృష్ణుడు నీవే .. మా భగవానువు నీవే
జీవుడు నీవే ,దేవుడు నీవే ... మా జీవనసత్యం నీవే నీవే

//పిలిస్తే //

చరణం 1:

మానవుడిగా జన్మించావే .. మహాయోగిగా మారావే
మహిమలెన్నో చూపావే ..మానవత్వం చాటావే

ప్రతీ ఇంట పటమై   వెలుగొందినావు
ప్రతీ గుండెలో కొలిచే రూపమయ్యావు

సమతా నీవే ,మమతా నీవే ..సర్వమత సారాంశం నీవే
సర్వం నీవే ,మర్మం నీవే ... భగవద్గీత అంశం నీవే

//పిలిస్తే //

చరణం 2:

సాధువుగా కనిపించావు  ...భిక్షపతిగా  జోలెత్తావు
మా పాపాలను హరించావు - సాయిలీలలతో ఆడావు

సత్యం నీవే ,ధర్మం నీవే - మా సత్యమార్గం నీవే
చరణం నీవే ,శరణం నీవే - మా సద్గురు సాయి నీవే

సాయివి నీవే ,హాయివి నీవే - మా షిరిడీ సాయివి నీవే నీవే
మా బాబా నీవే ,బంధం నీవే - శ్రీ సాయిబాబా నీవే నీవే