Monday, 25 May 2015

పాట నెం :25

ఏమాయో చేసావే 
మైకంలో దించావే
నట్టేటా ముంచావే 
నెరజాణ
సంకెళ్ళు వేసావే 
బందాన్ని పెంచావే 
బహుదూరం అయ్యవే 
జానే జాన 
నిన్ను చూసిన క్షణాన - నీవే లోకం అన్నా 
నీ మాటలుతోనే - కాలం గడవాలన్నా
రెప్పపాటునే కాలమనీ తెల్చేసావే 
జానే జానా - నెరజానా 

ఊహించానే ఊహలసుందరి 
వెన్నెల జాబిలి నీవని 
కవ్వించావే కన్నెల ఆమనీ 
కాలాతీతం నేననీ 
ఊసులు ఎన్నో ఉసిగోల్పావే 
నీ చుట్టూ నన్నే తిప్పించావే 
క్షణమైనా తోడులేననీ 
నేనున్నా చోటులేదనీ 
నిలిపావే నన్నీ నీ మదిలో 
ఊపిరినే పోసావే - నా శ్వాసలో 

ప్రేమించావే ప్రేమమయూరి 
నా ప్రానదేవతే  నీవనీ 
మనసిచ్చావే మందాకినీ 
నీ అదృష్టమే నేననీ 
నీ ప్రేమ దారలో బ్రతికించావే
నీ ప్రేమతో నన్నే మార్చేసావే 
ఏకాంతం అడ్డుకాదని 
నా సొంతం నీవే అన్నది

!!!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా





పాట నెం : 24

నాకిప్పుడు బోర్ అని 
నా ఫీల్ చెబుతుంది 
నాకేదో లోటు అని 
నా హృదయం తడుతుంది 
ప్రతీ క్షణం కిర్రుమంటూ ఊగుతుంది 
ఆ గడియారం గుర్రుమంటూ నిద్దురబోతోంది 
నీవు లేని నేనెలా
ఉండలేనా ధీమాగా 
దం దం శబ్దం 
లబ్ డబ్ అంటూ 
గుర్తుచేస్తుంది నిన్నే గుర్తుచేస్తుంది 

చెలియా రావా నీవుగా 
నాతో ఉండు తోడుగా 
నీ గుండెల మీద వాలిపోయి 
నా గోడునే చెప్పనా

ఆరోగ్యం బానే ఉంది 
అంతా మంచిగా ఉంది 
ఆలోచనే ఉన్నపాటుగా 
ఉలిక్కిపడుతుంది 
ఆకలి వేస్తుంది 
నిద్దుర పడుతుంది 
కల్లుమూస్తే చాలే చెలియా 
భయమే పుడుతుంది 
ఇన్నాళ్ళుగా సాగిన జీవితం 
నీతో కలిసిన పుస్తకం 
ఇకపై ఎటువైపు నా పయనం 

నడుస్తున్నాను,నవ్వుతున్నాను 
నా పనేంటో నే చేస్తున్నాను 
చలాకీగా ఉన్నాను 
చతుర్లేస్తూ ఉన్నాను 
ఇంతలోనే నిశబ్దంలోకి
వెళ్ళిపోతుంటాను 
నిన్ను గుర్తుచేసే తీరిక లేదుగా 
నా కంటిపాపలో ఉండినువ్వు 
కన్నీరునిస్తావు 
మదురమైన బంధం అని 
నా మాటలకే ఉంది
మరొక్కమారు నీఊసోస్తే 
చాల హాయిగా ఉంటుంది 
ఎప్పుడొస్తావు అని నా కన్నే
నీకై వేచుంటుంది 
నిజమంటూ ఏముంది 
వెన్నలా కరిగిపోయింది 
ఎందుకిలా అయ్యిందంటే 
జవాబు ఏముంది 
నీకోసం - నిరూపమానం 
నా ప్రాణమే - అర్పితం 
ప్రియా నేను నీకే అంకితం 

!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా







పాట నెం :23

ప్రేయసి నా ప్రేయసి 
నన్ను విడిచి వేల్లావే రాకసి
నువ్వేలేని ఈ జగం శూన్యం
నువ్వేరాని ఈ క్షణం శూన్యం 
నువ్వేలేని వెన్నెల వెలుగు శూన్యం 
నువ్వేరాని విరిసేకుసుమం శూన్యం//ప్రేయసి//

అంధకారం అయోమయం 
బిక్కు బిక్కున భయం భయం 
అల్లాడుతున్నా అమావాస్యనై 
రోదిస్తున్నా పసిపాపనై 
ఏ దిక్కుల ద్వారం తెలియదు 
నా గుండె చప్పుడు ఆగదు
నువ్వేలేని నీలాకాశం శూన్యం
నువ్వేరాని రేపటి ఉదయం శూన్యం  //ప్రేయసి//

పిచ్చితనం వెర్రితనం 
చింత చావనీ ప్రేమతనం 
ఆక్రోశిస్తున్నా విషనాగునై
అన్వేషిస్తున్నా సన్యాసినై
నా చావుకి మార్గం తెలియదు 
ప్రేమచితి మంతైనా వేలుగదు
నువ్వేలేని నా ఈ ప్రాణం శూన్యం 
నువ్వేరాని ఈ బంధం శూన్యం //ప్రేయసి//


!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా


పాట నెం :22

ఒక కునుకే తొలిపయనం 
ఒక చినుకే తోలి అరుణం 
మదిరేపే మురళీనాధం
మనసు పిలిచే మైకంలో ఈ క్షణం 

ఒక స్వరమే కోయిల గానం 
ఒక నాట్యమే నెమలిపించం 
ఏదో దాహమే ఎదలో ఈ దినం 
ఎవ్వరాపగలరు ఎగసే కలహలం 

''సుస్వరాలవేల శుభమస్తు గాలి వీచే 
ఈ సన్నజాజి తీగ తన సిగ్గునే విడమరిచే'' 

కలకలా,కిల కిలా కమ్మని రేయి ఊసులా 
జల జలా ,జుం జుమ్మనెలా ఒళ్ళంతా కరెంటు షాకులా
ఏదోలా ,ఈ వేళ పిచ్చ పిచ్చగా ఉందీ మదుభాల
ఏమోరా ,అది ఏమోరా చెప్పలేను అది ఎలా ఎలా 

గల గలా, అల అలా పారేటి సెలయేరులా 
మిల మిలా ,సల సలా ఉప్పొంగే మనసు మెరుపులా 
ఈ కిన్నెర ,కన్నె పిల్లరా కవ్వించకు చిలిపిగా 
సుందరా ,అందరా ఆనందమైన ఈ క్షణాలిలా

చిలిపి సరదాల ,చినుకు కురిసేలా ,చిందులేయాలా 
చిన్నబోకుండా ఈ రేయిలా 
విరహతాపాల, మసకపోయేలా ,విహరించాలా
వెన్నెల్ల నీడల్లో ఈ వేళ 

!!!!!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా


పాట నెం :21

ఒక్కసారి వచ్చిపోవా చినుకా 
నన్ను తాకి వెళ్ళిపోవా చినుకా 
నీ చినుకుల వర్షం 
అందరికీ హర్షం 
నాకేమో దు:ఖం 
పొంగుతుంది నేస్తం 
నీ జాడలో, నీ నీడలో 
నే తడవాలనీ 
ఈ రేయిలో , కన్నీళ్ళలో 
నే నిలవాలనీ 
ముద్దయి పోవాలనీ 
మునిగి పోవాలనీ 
నీ ఒడిలో, ఈ జడిలో 
నన్ను నేనే తడుముకోవాలనీ 

చేసాను చేలిస్నేహం 
చేసుకున్నా సమస్తం 
తన అడుగుల దూరం 
అయ్యెను నాకు భారం భారం 

భగ్నమైన నా హృదయం 
పోయిందని నా సర్వం 
బలిదానం నా పయనం 
అయ్యెను నాకు గగనం గగనం 

మరువమని నా వయసు 
మరువకని నా మనసు 
తడుతుంటే 
వెంట పడుతుంటే
వెక్కి వెక్కి ఏడుస్తూ 
నీ ధరి చేరా చినుకా 
వదలని నేస్తం నీవేగా 
తను వేరై పోతున్నా 
బాధ తీర్చే వైనం నీదేగా 
ఏ బందం కాదన్నా 

!!!!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా

పాట నెం :20

అమ్మాయి ఏడుందో
అందాల కాలేజిలోనా ?
అది కాస్త వదిలేస్తే 
మ్యారేజి ఏనా ఏనా ?
తను అందంగా ఉన్నా
తన వంక చూడలేదా ?
కాలేజి డేస్ లోన 
అంత పట్టింపే లేదా ? 

కాలేజి దాటి నేను 
లవ్ ఏజీ కే వచ్చేసాను 
ఆ లవ్ లో లబ్ డబ్ బదులు 
లవ్ లవ్ అనే నా గుండెకు నేర్పాను 
ఫ్రెండ్స్ అంతా బోరింగ్ కొట్టే 
లవ్ అంతే కేరింగ్ పుట్టే 
తననే నే ఫాలో అయ్యే 
పుకార్లు రేగి గోడల కెక్కె 
ఛి ఛి పోరా చెబితే వినరా 
అనే జవాబు నా నోటిన వచ్చే 
అబ్బబ్బ వద్దు అంత లేదు 
అని ఫ్రెండ్స్ నాపై చెలరేగే 
క్లాసు రూం లో బుక్స్ కి బదులు 
లుక్సు లుక్సు నే కలిపేశాను 
ఫస్ట్ మీట్ లో గిఫ్ట్ కి బదులు 
నే లవ్ లెటర్ నే ఇచ్చేశాను 

తన నుంచి రెస్పాన్సు 
నా కొచ్చే భలే చాన్సు 
ప్రపంచాన్నే గెలిచినట్టు 
ఇక తనతోనే సాగెను నా జట్టు 
చదివే రోజులు పోయి 
జాబ్ కాల్స్ లో చేరిపోయా 
పుస్తకాలనీ వదిలినా 
తన ప్రేమకి బై నే చెప్పలా
ఇటువైపు జాబుని 
అటువైపు ప్రేమని 
రెండుకల్లలా చూసాను 
రెచ్చిపోయి సాగాను 
నైటంతా టాకింగ్ 
డే అంతా చాటింగ్ 
టైం దొరికితే తనేగా నా డార్లింగ్ 
హ్యాపీ గా కొన్ని రోజులు 
అడ్వాన్సు అయ్యి పోయాము 
బందమంటే ఒకటుందని 
ప్రేమతో  మే నడిచాము 

ఇంకేముంది 
ఇక పెళ్లేగా మీ ఇద్దరికీ 
అని చూసేవాల కళ్ళకి 
నిజమయ్యిద్దంటూ చెప్పాము 
హడావిడి జీవితం 
బాగా తిరిగెను గడియారం 
టైం అంటూ వచ్చేసింది 
తొందరనే చేసేసింది 
పేరెంట్స్ ఏమో పెళ్ళికి 
మేమేరుగని దారికి 
ఊహించని కొసమెరుపు 
మాకు లేదు ఏ మలుపు 
మరి ఇంకేమయ్యింది ? 
తనకి పెళ్లైంది 
నీతో నేనా ? 
కాదు వేరే వాడితో 
మరి నీ సంగతి 
దొరక్కపోదుగా ఏ జోడి 
అంటూ ముందుకు కదిలే నా గాడి 

!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా