Monday, 7 September 2015


పాట నెం :47
అందునా ఆకాశం
(03 .౦4.07 )

అందునా ఆకాశం అరచేతిలో ఒక పువ్వుగా
నిలుచునా సంద్రం సర్వం మేఘంలోనే ఘాటుగా 
ప్రియతమా నీ కనులను చూశా
రెప్పమాటున ఉన్నది మరిచా
అదియునే నిజమని తలచా
నీ నీడలోనే నిముషము నిలిచాలే

కలిసాము కలలల్లే , ఆడాము అలలల్లే
హయంటే రేయి పగలూ తేడా తెలియకుండానే 
చదివాము బాషలెన్నో ,మన మనసు ఊసులెన్నో 
ఉప్పెనే ఎదురొచ్చినా కొట్టుకుపోయేలా 
ఇంత వెలుగై విరిసీ మళ్ళీ చీకటి వచ్చేనా
వద్దంటే ఆగున కలం - మార్చునా సూర్యుని వేగం
ప్రొద్దుతిరుగుడు పువ్వుకే - ప్రొద్దు వచ్చేనా

నువ్వంటే నేనున్నట్టు - నేనంటే నువ్వున్నట్టు
మనమే ఒకరికిఒకరు ఉంటున్నట్టు
అది అంతా ఏమైనట్టు - అట్లాంటిక్ మునిగేటట్టు
మరునేవ్వడు మార్చలేని దీవులైనట్టు
ఊహించతనికే ఒరవడి లేదు
నిజమే కానీ తట్టుకోలేము.
గుడ్ బై చెప్పలేని వసంతమే నువ్వా?
ఎడబాటుతో జ్ఞాపకాలే ప్రతిచోటునా

!!!!!!!!
గరిమెళ్ళ రాజా

No comments:

Post a Comment