Sunday, 29 May 2016

పాట : 54

చిన్న పాట ... చాలా రోజుల తర్వాత 



పల్లవి :


నిదురే రాదు నిన్ను చూడక 

నిముషం అయినా నిన్ను వీడక 
ఉండనంటున్నది మనసే 
మాననంటున్నది తపస్సే 

ఏకాంతమే ఊగిపోతున్నది 

నీ తలంపులో తేలిపోతున్నది .....    //నిదురే //


చరణం 1:


ఎంతెంత దూరం 

మన కలలకు విడ్డూరం 
ఇంకెంత దూరం 
నిన్ను చేరు తరుణం 

ఈ దూరమెంత భారం 

మన ప్రేమకు శ్రీకారం 
పుంజుకుంటూ  వేగం 
మన మనసు గాలి వేగం 

ఆకాశమే అవనిని దాటి 

ఆనందమే వరమును తెచ్చి 
ఇద్దరినీ దరికి చేర్చే క్రమములో .....   లో లో  ///నిదురే //