పాట నెం :19
ఎదురుచూపే చూస్తున్నా నువ్వస్తావనీ
ఎదలో మదనే పడుతున్నా నిను చూడాలనీ
నీ కోసమే నేనున్నది - నీవు లేనిదే నేను లేనులే
నా ప్రాణం నీవేగా //ఎదురు//
నిన్ను చూడకుండా కంటికి నిద్దురే లేదులే
నిన్ను మరువలేక మనసుకి మౌనమే ముచ్చటయ్యేనే
ఎవరు పిలుపు విన్నా -నీ పలుకే అనుకుంటున్నా
ఎటువైపు నే చూస్తున్నా - నీ రూపమే కలగంటున్నా
ఎద పావురంలా ఎగురుతుందే - నిన్ను కలవటానికి //ఎదురు//
నువ్వు పక్కన ఉన్నన్నాళ్ళు నాకు పొద్దే తెలియలేదే
నా చెంతన నీవు లేక - కాలమే గడువదే
ఆనాటి మన అలకలు -ఈనాటి జ్ఞాపకాలయ్యేనే
ఆనాటి మన ముచ్చటలు - మూన్నాళ్ళ ఓదార్పుగా మారెనే
తెలిసిందిలే తలపేమిటో - ప్రియా నీవు లేని భారం //ఎదురు//
!!!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా
No comments:
Post a Comment