Monday, 25 May 2015

పాట నెం :16

పల్లవి ;

తాగుబోతునయ్యాను పిల్లో నీ  వల్లనే  
మానలేకపోతున్నా పిల్లో నీ వల్లనే 
ఎందుకే నన్నిలా  చేసావ్ పిల్లో ఓ పిల్లా 
నా గుండె కోసి చేతికిచ్చావే పిల్లో ఓ పిల్లా    //తాగుబోతు//

చరణం 1:

నీ బాబు చుట్టమా నాకేమన్నా 
నీ ఆస్తంతా అడిగానా నేనేమన్నా 
వల్లంటే వల్లకాదు అంటావే పిల్లా 
నే ఒంటరైతే బ్రతికేది ఎల్లా 
తూనీగ లాగా పోతున్నవే పిల్లా 
కాస్తంతా ఆగి నన్ను చూడు మల్లా 

బాటిలంతా ఖాళిచేసి 
బాటిలంతా ఖాళిచేసి బిక్కు బిక్కు మంటున్నా 
పరీశాన్ అవ్వలేక ఈ కిక్కు తోటి చస్తున్నా        //తాగుబోతు//


చరణం 2:

ఏమంతా హృదయమే ఓ నా మైనా 
కాస్తకూడా జాలి లేని దిల్ నీదేనా 
నువ్వంటే ఇష్టమని నేనంటున్నా 
ఏమి పట్టనట్టు ఎందుకే జాన నా జాన 
నాలోన తక్కువేంటి నీకన్న ఓ నాన్నా 
నీ లోపల  ఉన్నది తెలుపవెంటమ్మా

మందంతా అయిపోతే 
మందంతా అయిపోతే  మళ్ళీ గుర్తుకొస్తావే 
మనసట్టా బాదపడినా నీ బెర్త్ ఇవ్వనంటావే

No comments:

Post a Comment