పాట నెం :17
ఎలా నిన్ను ప్రేమించాలి ఓ ఆడబొమ్మ
ఎలా నిన్ను ప్రేమించాలి ఓ పుత్తడిబొమ్మ
ప్రేమంటూ తెలియదే
నీతో ప్రేమలో పడ్డానే
ప్రేమించటం అంటే ఏమిటో
నే ఇప్పుడే చూస్తున్నా //ఎలా//
ఒక్క పువ్వునే 100 సార్లు నీకు నేనివ్వనా
ఒక్క మాటనే 1000 సార్లు నీకు నేచెప్పనా
నీ చుట్టూనే తిరిగెయ్యనా - తిరిగే భూమల్లే
నీ వెంటే వచ్చేయ్యనా - కదిలే నీడల్లే
నీ కళ్ళలోన కల్లుపెట్టి - కాలమంతా పక్కనెట్టి
నిన్ను చూస్తూనే ఉండిపోనా -నెరజానా
నీ చేయిలోన చెయ్యిపెట్టి - చిన్న ఫీల్ నొక్కి పెట్టి
నీ గుండెపై వాలిపోనా - ఆ నిముషానా //ఎలా//
నా కలలో ప్రతిసారి నిన్నే నేపిలువనా
నీ ద్యాసలో నీ నామజపాన్ని నేనుచేసేయనా
నీ రూపాన్ని చెక్కేయ్యనా - చిత్రకారుడినై
నీపై కవితనే రాసేయనా - కవిచక్రవర్తినై
నీ అడుగులోన అడుగువేసి -ముందువెనుక వదిలేసి
నీతో పయనమే సాగించనా - ఓ వెన్నెలమ్మ
నీ శ్వాస లో శ్వాస నిలిపి -ఊపిరంతా బిగబెట్టి
నీప్రేమలోనే బ్రతికెయ్యనా - ఓ నా ప్రేమజన్మ //ఎలా//
!!!!!!!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా
No comments:
Post a Comment