పాట నెం : 24
నాకిప్పుడు బోర్ అని
నా ఫీల్ చెబుతుంది
నాకేదో లోటు అని
నా హృదయం తడుతుంది
ప్రతీ క్షణం కిర్రుమంటూ ఊగుతుంది
ఆ గడియారం గుర్రుమంటూ నిద్దురబోతోంది
నీవు లేని నేనెలా
ఉండలేనా ధీమాగా
దం దం శబ్దం
లబ్ డబ్ అంటూ
గుర్తుచేస్తుంది నిన్నే గుర్తుచేస్తుంది
చెలియా రావా నీవుగా
నాతో ఉండు తోడుగా
నీ గుండెల మీద వాలిపోయి
నా గోడునే చెప్పనా
ఆరోగ్యం బానే ఉంది
అంతా మంచిగా ఉంది
ఆలోచనే ఉన్నపాటుగా
ఉలిక్కిపడుతుంది
ఆకలి వేస్తుంది
నిద్దుర పడుతుంది
కల్లుమూస్తే చాలే చెలియా
భయమే పుడుతుంది
ఇన్నాళ్ళుగా సాగిన జీవితం
నీతో కలిసిన పుస్తకం
ఇకపై ఎటువైపు నా పయనం
నడుస్తున్నాను,నవ్వుతున్నాను
నా పనేంటో నే చేస్తున్నాను
చలాకీగా ఉన్నాను
చతుర్లేస్తూ ఉన్నాను
ఇంతలోనే నిశబ్దంలోకి
వెళ్ళిపోతుంటాను
నిన్ను గుర్తుచేసే తీరిక లేదుగా
నా కంటిపాపలో ఉండినువ్వు
కన్నీరునిస్తావు
మదురమైన బంధం అని
నా మాటలకే ఉంది
మరొక్కమారు నీఊసోస్తే
చాల హాయిగా ఉంటుంది
ఎప్పుడొస్తావు అని నా కన్నే
నీకై వేచుంటుంది
నిజమంటూ ఏముంది
వెన్నలా కరిగిపోయింది
ఎందుకిలా అయ్యిందంటే
జవాబు ఏముంది
నీకోసం - నిరూపమానం
నా ప్రాణమే - అర్పితం
ప్రియా నేను నీకే అంకితం
!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా
No comments:
Post a Comment