Monday, 25 May 2015


పాట నెం :21

ఒక్కసారి వచ్చిపోవా చినుకా 
నన్ను తాకి వెళ్ళిపోవా చినుకా 
నీ చినుకుల వర్షం 
అందరికీ హర్షం 
నాకేమో దు:ఖం 
పొంగుతుంది నేస్తం 
నీ జాడలో, నీ నీడలో 
నే తడవాలనీ 
ఈ రేయిలో , కన్నీళ్ళలో 
నే నిలవాలనీ 
ముద్దయి పోవాలనీ 
మునిగి పోవాలనీ 
నీ ఒడిలో, ఈ జడిలో 
నన్ను నేనే తడుముకోవాలనీ 

చేసాను చేలిస్నేహం 
చేసుకున్నా సమస్తం 
తన అడుగుల దూరం 
అయ్యెను నాకు భారం భారం 

భగ్నమైన నా హృదయం 
పోయిందని నా సర్వం 
బలిదానం నా పయనం 
అయ్యెను నాకు గగనం గగనం 

మరువమని నా వయసు 
మరువకని నా మనసు 
తడుతుంటే 
వెంట పడుతుంటే
వెక్కి వెక్కి ఏడుస్తూ 
నీ ధరి చేరా చినుకా 
వదలని నేస్తం నీవేగా 
తను వేరై పోతున్నా 
బాధ తీర్చే వైనం నీదేగా 
ఏ బందం కాదన్నా 

!!!!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా

No comments:

Post a Comment