పాట నెం :14
పల్లవి :
ఎంత చెప్పినా తక్కువేనట అమ్మ గురించి
ఎంత పిలిచినా మక్కువేకద అమ్మ పేరు తలచి
భూమాతలోని సహనం అమ్మ
ప్రకృతిలోని సౌరభం అమ్మ
ఈ సృష్టికి మూలం అమ్మ
దైవమైనా బ్రహ్మకు కూడా కావాలి
ప్రేమకై అమ్మా ఆ ఆ ఆ ఆ ఆ .........
ప్రతి జన్మకు అడగక దొరికే వరపాశం
అమ్మా ఆ ఆ ఆ ఆ ఆ ............ //ఎంత //
చరణం 1 :
మమతల కోవెల మనసై
త్యాగాల వెన్నెల తలపై
నిన్ను చూసి మురిసిపోయే మై మరపే అమ్మా
అడుగులు నేర్పగా తోడై
నిదురలో నీకొక నీడై
లాలిపాటగా సేదతీర్చే సంగీతగీతమే అమ్మా
పెదవులు పలికిన మాటల అలలకి ప్రేమతీరం అమ్మా
మనసున మెదిలిన కమ్మని కధలకి స్నేహకావ్యం అమ్మా //2 // ఎంత //
చరణం 2 :
దివిలో మెరసిన మెరుపై
భువిలో వెలసిన వెలపై
నీకై తపించు ,నిన్నే వరించు నేస్తం అమ్మా
కనుపాపలనొసగిన రెప్పలై
చిరునవ్వులనొసగిన ఉసురై
నీకై శ్రమించు ,నిన్నే స్మరించు ప్రాణం అమ్మా
రుణాలు ఎరుగని జగాల మనుగడ అందం కద అమ్మా
జన్మలు మారినా జననం నుండే ఆత్మ బంధం అమ్మా //2 // ఎంత //
సందేశం :-
అమ్మ విలువ తెలుసుకో
అమ్మ ప్రేమ గెలుచుకో
అమ్మను బాగా చూసుకో
అమ్మ సేవ చేసుకో
ఈ సృష్టిలో అమ్మకు మించిన అద్బుతం
అంతకు మించిన కమ్మదనం లేదు ,రాలేవు
శాశ్వతమైనది అమ్మ ప్రేమ ,
అనిర్వచనీయమైనది అమ్మ ప్రేమ
జన్మ జన్మల సుకృతం అమ్మ ప్రేమ
మన పుట్టుక తర్వాత మనకు తెలిసి తెలియక మనం అమ్మని ఎంత కష్టపెట్టామో అయినా అమ్మ మమకారం మనల్ని ఎంత ఇష్టంగా పెంచి ,పెద్ద చేసి ,ప్రయోజకుల్ని చేసిందో అటువంటి అమ్మని జీవితాంతం ప్రేమగా చూసుకోవడం మన కర్తవ్యం
మీరు పెద్దవాళ్ళు అయ్యారని ,మీ బాద్యతలు పెరిగాయని ,మీకు కష్టంగా ఉంటుందని మాత్రం అమ్మను ఆశ్రమాలకు పంపకండి

No comments:
Post a Comment