Sunday, 23 August 2015

పాట నెం :31

నీకు తోచిందే నువ్వు చెయ్యి సుల్తాను 
నీ దారిలో నీకు నువ్వే జావాను 
తూర్పు - పడమర ఏమైననూ 
నీ కున్న దిక్కులోనే ఎగరెయ్యి జండాను  //నీకు తోచిందే// 

ఏందిరా  కన్ ఫ్యూజను 
ఎట్లుందని నీ సోచను 
ప్రపంచంలో అందరూ నీలాంటోల్లే
ఆ అందరిలో కొందరూ ఇట్లాంటోల్లే
నచ్చచెప్పి చూడరా నచ్చుతావేమో 
అప్పగింతలేలరా అయోమయంలో    //నీకు తోచిందే//

వెనుక ముందు ఎందుకు ఇరకాటము 
ఎదురెళ్లి  చూస్తే దానికాటంకం
చరిత్రలో చదవటానికి పేజీలెన్నో 
ఒక్కొక్క పేజి చెప్పే మన కధలెన్నో 
అల్లుకొని పోవాలి  ఆనందంతో 
మార్పన్నది తేవాలి నీ ప్రేమ మార్గంతో  //నీకు తోచిందే//


- గరిమెళ్ళ రాజా 




No comments:

Post a Comment