Sunday, 23 August 2015

పాట నెం :30

ఒక్క క్షణం ఒక్క క్షణం ఒక్క క్షణం 
ఆలోచించు నువ్వు ఒక్క క్షణం 
అధిరోహించు నువ్వు ఆ క్షణం 
ఇక ఆనందమే మరో క్షణం       //ఒక్క క్షణం//

సహించలేని సమయమున నిరీక్షించు 
నీ నిరీక్షణలో విచక్షణ కొనసాగించు 
మెలకువగా నిన్ను నువ్వు పరీక్షించు 
నిలకడలో నిజము నువ్వు పరిశోదించు 
క్షణమైనది విలువైనది 
గడిచినది రానిది 
క్షణమైనది సొగసైనది 
మన చేతిలో అది ఉన్నది     //ఒక్క క్షణం//


భరించలేని స్థితిలోన సముదాయించు 
భ్రమలో నీవు ఉన్నవేళ అది గమనించు 
పొరపాటు జరగకుండా సంరక్షించు 
ధర్మముగా ఉండటాన్ని ఆచరించు 
క్షణమైనది మెలికైనది 
నీ మార్పుకు శ్రీకారమది 
నీ చెంతనుండే ఓ గుణమది  //ఒక్క క్షణం// 


''మనల్ని మార్చేది ,మార్పు తెచ్చేది ఆ ఒక్క క్షణమే 
మంచికైనా ,చెడుకైనా కారణం ఆ ఒక్క క్షణమే 
మనం ఎలా ఉన్నా ,ఇలా ఉన్నా 
మనం కేవలం ఆ క్షణ భాదితులమే 
కనుక ఒక్క క్షణం ఏమైనా చేసే ముందు 
ఆలోచన చేయగలిగి ,సరైన నిర్ణయం 
తీసుకోగల్గితే తక్షణం మన జత కడుతుంది కదా ఆనందము ''


- గరిమెళ్ళ రాజా 

No comments:

Post a Comment