పాట నెం :28
పల్లవి //
ఉరకలేస్తు సూరీడు
తొంగి తొంగి తొంగి చూస్తుండు
మబ్బుల్లో దాగి చంద్రుడు
మౌనంగా అది వింటుండు
ఆకాశమే హరివిల్లు
అంటుంది ఈ చిరుజల్లు
హైలెస్సో ఓ ఓ హైలెస్సా //2//
కాటుక రెప్పన పూసిన పువ్వా నవ్వాలి
రేలా రేలా రేలా రేలా రేలారే
చిగురాకు చిన్ని సిరి సిరి మువ్వా ఆడాలి
రేలా రేలా రేలా రేలా రేలారే //ఉరకలేస్తు //
చరణం1 //
కాశ్మీరం వచ్చింది చూడు
కొత్తదనం వచ్చే నేడు
నీ తోటి కలిసెను జోడు
నీకంటూ వుంది ఒక తోడు
నిన్నలా లేని నేటి ఉధయం
కురిపిస్తోంది తన హర్షం
ఏ జాబిలమ్మ దిగి వచ్చిందో
ఏ కూనలమ్మ మిమ్ము కలిపిందో
హైలెస్సో ఓ ఓ హైలెస్సా//2//
మాటలురాని మౌనం తెర వీడాలి
రేలా రేలా రేలా రేలా రేలార
చేతికందిన చెలితో జోక్యం పెరగాలి
రేలా రేలా రేలా రేలా రేలారే //ఉరకలేస్తు //
చరణం2 //
అందంగా ఉంది నేడు
తన చెయ్యందుకోమంది చూడు
సిగ్గు పడి ఆడ ఈడు
అడుగు కదపకుంది మరి చూడు
కదిలే బొమ్మా -కలిసిన సమయం
కలిపిందిలా వసంతం
కోయిలమ్మ స్వాగతించింది
నేలతల్లి దీవించింది
హైలెస్సో ఓ ఓ హైలెస్సా//2//
వెన్నెల వేళ పున్నమి నేడు దిగివచ్చే
రేలా రేలా రేలా రేలా రేలారే
మంచి లగ్గమే సింగారంగా తరలోచ్
రేలా రేలా రేలా రేలా రేలారే //ఉరకలేస్తు //
No comments:
Post a Comment