పాట నెం :53
ఎక్కడ నుంచి వచ్చింది కందిరీగ
ఎక్కడ నుంచి వచ్చింది కందిరీగ
నన్ను ఇలా కుట్టింది తొందరగా
ఒక్క చూపుతో నన్ను చుట్టేసింది
ఒక్క సిగ్నల్ తో చిత్తు చేసింది
అలా వచ్చి ఇలా గిచ్చి నా మనసు దోచి
అల్లకల్లోలం చేసేసింది
నన్ను అయోమయంలో పడవేసింది
మొదటసారి చూసాను
మొహమాటం విడిచాను
మాట మాట కలిపాను
మాటల్లో అడిగాను
ఏమని ?
నచ్చానా నేను నీకని
మరి పెంచనా నా బైకు స్పీడుని
మరి తానేమంది ?
అమాంతంగా హత్తుకుపోయింది
సిగ్గుతోటి మురిసిపోయింది
గ్రీన్ సిగ్నల్నే గ్రీన్ సిగ్నల్నే
గ్రీన్ సిగ్నల్నే నాకు ఇచ్చేసింది
ఇకపైనా ఇంట్లో మాట్లడమంది
తర్వాత ఏమి జరిగింది ?
నైటు అంతా నిద్దుర లేదు
తిందామంటే ఆకలి లేదు
ఆలోచనలతో హాట్ అయ్యాను
మరో ఉదయం కోసం ఎదురు చూసాను
మరి తనకి కూడా అలానే ఉందా ?
అంతేగా మరి.........
ఉన్నపాటుగా ఏదో తోడూ నన్ను కోరినట్టుగా
నాకు కూడా మరోలోకం అన్నీ తానైనట్టుగా
ఆనందం చిందులు వేసింది
ఆ క్షణం హాయని పించింది
మరి ఇంట్లో చెప్పాలిగా ?
ఎందుకు చెప్పలేదు చెప్పాను ......
హార్ట్ టచ్ అంటే ఏమిటో
ఇప్పుడే చూశానని
చేసుకుంటే తనకే నేను
ఫిక్స్ అయ్యానని
మరి వాల్లెమన్నారు ?
మీకిష్ట మయితే మాదేముంది
మంచిరోజులు ముందర వుంది
అప్పటిదాకా ఆగండండి
ఈలోపు ఒకరికొకరు అర్డంకండి
మరి వాట్ నెక్స్ట్ బాస్ ?
ఇంకేముంది
ప్రస్తుతానికి ఇంటర్వెల్
త్వరలో వస్తుంది శుభం కార్డ్
///////////////////
గరిమెళ్ళ రాజా
No comments:
Post a Comment