Monday, 16 February 2015

స్వచ్చ్ భారత్ పై ఒక పాట (Final )


పాట నెం :11

స్వచ్చ్ భారత్ పై ఒక పాట 
************************
పల్లవి :
లేవండీ లేచిరండి చూస్తోంది భారత్
రండి కదలిరండి పిలుస్తోంది భారత్
అచ్చంగా స్వచ్చమైన దేశం 
ఇది మన దేశం
ప్రతి పౌరునికి ఇదే సందేశం 
ఇది మన దేశం
స్వచ్చతకై స్వచ్చందంగా కదులుదాం
దేశాన్ని దేహాన్ని పరిశుభ్రంగా మనముంచుదాం 
ये हमारा भारत - यही है स्वच्छ भारत // 2//
THIS IS MY INDIA - OUR CLEAN GREEN INDIA //2//

చరణం 1:
ఒక్క అడుగుతో ప్రయాణం సాగదు  
ఒక్క మాటతో మార్పు జరుగదు   //2//
భిన్న జాతుల విభిన్న భాషల దేశం మనది  
జై భారత్ - జై జై భారత్
అనేక గుండెల స్పందనతో సాధ్యమే స్వచ్చ్ భారత్ 
జై భారత్ - జై జై భారత్ 
 జన నేత మోడీ ఎలుగెత్తిన పిలుపే
''స్వచ్చ్ భారత్''  ''స్వచ్చ్ భారత్'' 
జాతి పిత స్పూర్తితో పుట్టిందే 
''స్వచ్చ్ భారత్ '' ''స్వచ్చ్ భారత్'' 
ఒక్కటై అందరు కదులుదాం  
సర్వులు కలిసి నడుద్దాం  
ఈ దేశమే ప్రగతిలో ప్రధమంగా వుండాలి 
మనదేశమే విశ్వంలో అన్నింటా ముందుండాలి 
listen my friend  - change this trend
come to fore- why country suffer

ये हमारा भारत - यही है स्वच्छ भारत // 2//

THIS IS MY INDIA - OUR CLEAN GREEN INDIA //2//

చరణం 2:
ఆశుభ్రమే అంటు రోగాలు అంటుకట్టే 
బలయ్యే ప్రాణాలెన్నో ఆశుభ్రదారుల్లో 
ప్రతి పల్లెలో ప్రతి వాడలో ప్రతి చోట 
ప్రతి ప్రాణి ప్రాణసంరక్షణే ద్యేయముగా 
ముందుకు సాగుదాం 'జై భారత్' నినదిస్తూ 
మనమందరం ఒకే మాట బాటగా సాగుతూ  
పరిసరాల పరిశుభ్రతయే ప్రధాన లక్ష్యంగా
ఆరోగ్యమే మహాభాగ్యమని పిలుపునిస్తూ 
''స్వచ్చ్ భారత్ ''తో దేశంకి స్వచ్చతనందిద్దాం 
పర్యావరణ సంరక్షణే ధ్యేయంతో నడుద్దాం 
''స్వచ్చ్ భారత్'' పై చైతన్యం రావాలి తేవాలి 
ఎల్లరు ఇల్లు వీడి సిగ్గు విడి వీధిలోకి రావాలి  
స్వచ్చతకై స్వచ్చందంగా కదులుదాం
దేశాన్ని దేహాన్ని పరిశుభ్రంగా మనముంచుదాం
listen my friend  - change this trend
come to fore - better late than never 

ये हमारा भारत - यही है स्वच्छ भारत // 2//
THIS IS MY INDIA - OUR CLEAN GREEN INDIA //2//

No comments:

Post a Comment