Sunday, 15 February 2015

స్వచ్చ్ భారత్ పై ఒక పాట (Trail )

స్వచ్చ్ భారత్ పై ఒక పాట 
*************************************

పల్లవి :
లేవండీ చూస్తోంది భారత్
రండి రండి పిలుస్తోంది భారత్
స్వచ్చమైన దేశం ఇది మన దేశం
ప్రతి పౌరుని దేశం భారతదేశం
స్వచ్చందంగా మనమే కదులుదాం
పరిశుభ్రంగా దేశాన్ని మార్చుదాం /కాపాడుదాం

ये हमारा भारत - यही है स्वच्छ भारत // 2//
THIS IS INDIA - OUR CLEAN INDIA //2//

చరణం 1:
ఒక్క అడుగుతో ప్రయాణం సాగదు
ఒక్క పిలుపుతో మార్పు జరగదు  //2//
అనేక జాతుల ,అనేక భాషల దేశం మనది  భారత్ - జై భారత్
అనేక గుండెల స్పందన ఉంటే సాధ్యమే స్వచ్చ్ భారత్ - జై భారత్
మన ప్రధాన మంత్రి మోడీ పిలుపే ''స్వచ్చ్ భారత్ ''
మహాత్మ గాంధీ స్పూర్తితో పుట్టిందే ''స్వచ్చ్ భారత్ ''
ఒక్కటై రావాలి ముందుకి
ఈ దేశమే నడవాలి ప్రగతిలో ముందుముందుకి

listen my friend  - change this trend
come to front - do your best

ये हमारा भारत - यही है स्वच्छ भारत // 2//

THIS IS INDIA - OUR CLEAN INDIA //2//

చరణం 2:
ఆశుభ్రతోటి  అంటు రోగాలు ఎన్నో
భలి అవుతున్నా ప్రాణాలు ఎన్నో
ప్రతి పల్లెలో ,ప్రతి వాడలో ప్రతి ప్రాణి సంరక్షణే ద్యేయముగా - జై భారత్
ప్రతి చోట ,ఒకే మాట పరిశుభ్రతయే లక్ష్యంగా - జై భారత్
ఆరోగ్యమే మహాభాగ్యం పిలుపు ''స్వచ్చ్ భారత్ ''
పర్యావరణ సంరక్షణే  '' స్వచ్చ్ భారత్ ''
సిగ్గు విడిచి రావాలి ముందుకి
సమాజ చైతన్యం తేవాలి ప్రతి చోటకి ,ప్రతి వారికి

listen my friend  - change this trend
come to front - do your best

ये हमारा भारत - यही है स्वच्छ भारत // 2//

THIS IS INDIA - OUR CLEAN INDIA //2//















   

No comments:

Post a Comment