Thursday, 15 January 2015

పాట నెం :10

అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ 
సంక్రాంతి పండుగ గురించి క్లుప్తంగా  నేను రాసిన పాట మీ కోసం 
***********************************************


సం సం సంక్రాంతి సందడి వచ్చిందోయ్ 
ఇంటింటా సంతోషం వెలుగులు తెచ్చిందోయ్ 
గోబిపూల గొబ్బిళ్ళో
ముత్యాల  ముగ్గుల్లో
నీలాకాశం వెన్నెల్లో
ఆ నెలవంక ముంగిట్లో
అందర్నీ గిచ్చి గిచ్చి నిద్దుర లేపిందోయ్   //సం సం సంక్రాంతి //

చరణం 1:-
ఇది మూడు రోజుల పండుగ
పెద్ద సంప్రదాయమే నిండుగా
నిత్య తోరణాల మాలలు అల్లగా
నీ కంట్లో చూడాలో కోవెల దీవాళి
చిరకాలం నిలిచుండే చెలిమే కావాలి
చిన్నా పెద్దా తేడా లేదు
బీదా గొప్పా బేదం లేదు 
హలం పట్టి పొలమే  దున్ని
నవధాన్యాలు నైవేద్యం పెట్టి
ఆహ్వానించు మనసారా
అరిసెలు ,బూరెలు,చక్రపూసలు
నీ అరచేతితో చేసే వంటలు
శ్రమనంతా మై మరపించునురా  //సం సం సంక్రాంతి //

చరణం 2:-
గోమాత పూజలు
గొబ్బిమ్మల  ముగ్గులు
ఇవియేగా ప్రకృతి అందాలు
హరేరామ హరే కృష్ణ
హరే కృష్ణ హరే రామ
అంటూ హరిదాసు వచ్చిన ఇంట
మన ఆరోగ్యము సుఖమే నంట
అత్తమామలు, ఆడపడుచులు,
కొత్త అల్లుళ్ళు,కొంటె మరదళ్ళు
తెల్ల తెల్లవారుజామునే బోగి మంటలు
ముద్దు ముద్దు నవ్వుల చిన్నారులకు బోగిపళ్లు 
శీతాకాలం ప్రొద్దే  తెలియని
శిశిరమైన పండుగే ఈ సంక్రాంతి
ఈ సంవత్సరమంతా ఇంటింటా కాంతి
వర్దిల్లాలి సర్వత్రా నీ అబీష్టి  //సం సం సంక్రాంతి //

చరణం 3:-
విందుల తేనెల సుందర గమనం 
పందెం కోళ్ళ   యుద్దయాగం
చేస్తావి అవే ప్రాణత్యాగం
ఆపండి ఇకనైనా ఈ అరాచికత్వం
సందడిగానే ఉండండి
చిందులెన్నో వేయండి
మా మనసును నొప్పించకండి 
వ్యసనమనే మత్తుగా కారాదు సంక్రాంతి
విజయోస్తుగా సాగాలి మన మైత్రి  //సం సం సంక్రాంతి //
చరణం 4:-
పైరుగాలులు, పచ్చనేలలు
ఈ భూమాతకే అలంకరణలు
వాటిని చూసే రైతన్నా
రాజ్యం రావాలంటే
ఆత్మహత్యలు ,మోసగాళ్ళ
వైనం పోవాలంటే
పూజించరా దేవుడిని
ఈ సంక్రాంతి రాముడిని
ఈ రాక్షస రాజ్యం పోగొట్టి
రైతు బిడ్డకే అండగా జై కొట్టి  //సం సం సంక్రాంతి //

చరణం 5:-
సూరీడు వచ్చే తొంగి చూసే
మంచుమేఘం మొరాయించే 
చూడ చక్కని చిత్రాలు ఎన్నో ఉన్న సంక్రాంతి
చేమంతి,బంతి చిన్న  బోతుందే
జాబిలమ్మ నేలకు వాలిపోతుందే
తమని కూడా పిలువమని
కొత్త చుట్టంగా చూడమని
అడుగుతుండే మనసారా
ఇది ఏరా పండుగ
సంక్రాంతి పండుగ
సిరిసంపదలే కల్పవృక్షంగా
ముత్తైదువులకు పసుపు కుంకుంగా
చిన్నారులకు చిరు దీవేనగా
ఇంటింటా వెలసే అఖండ దీపం గా
వచ్చిందోయ్  సంక్రాంతి పండుగ
తెచ్చిందోయ్  సంతోషం నిండుగా   //సం సం సంక్రాంతి //

//రాజేంద్ర ప్రసాదు //15. 01 .15//

No comments:

Post a Comment