Saturday, 3 January 2015

పాట నెం :9

ఈ టివి 2 వారికోసం వాలెంటైన్స్ డే సందర్భంగా  నా మొదటి పాత 

ప్రేమను ,ప్రేయసిని వద్దంటూ ఒక ప్రేమికుడు పాడుకునే పాట 

**************************************************
పల్లవి :
నువ్వు నాకు వద్దు
నువ్వు నాకు వద్దు
నువ్వంటే నాకు ముద్దు కాదు

నన్నొదిలి  నువ్వు వెళ్ళు

నా వైపు నువ్వు రాకు
నా చూపు నీ వైపు లేదు

ఒకనాటి ప్రేమలో పునాది వేయకు

నన్నిలా సమాధి చేయకు
నీ జ్ఞాపకాలను నా వెంటరానీకు
ఆ ఊబిలో నన్ను పడనీయకు      //నువ్వు నాకు //

చరణం 1 :

నువ్వంటే ఇష్టమని  అన్నానేమో 
నువ్వేనా ప్రాణమని తలచానేమో 
ఆ ఇష్టం ఆ ప్రాణం ఆనాటిదే 
ఇది కష్టం నా ఇష్టం ఈ నాటిది 
మర్చిపోయి చచ్చిపోయా 
మరోసారి జన్మ వద్దు ప్రేమలోనా 
పారిపోయి ఆగిపోయా 
వెనక్కి రాలేక ఇరుక్కుపోయా  
అందుకే ..... 
                                                       / /నువ్వు నాకు //

చరణం 2:

నీకోసం నీడలాగ నిలచానేమో 
నీకోసం కలలెన్నో కన్నానేమో 
ఆ ద్యాస ఆ శ్వాస ఆనాటిదే 
ఈ నాడు నీ ద్యాస లేనేలేదే 
ఓడిపోయి విసిగిపోయా 
ప్రేమంటే ఓటమని తెలిసాక 
ప్రేమపాలై మునిగిపోయా 
ఈదలేక చావలేక ఉండిపోయా  అందుకే    //నువ్వు నాకు //



No comments:

Post a Comment