పాట నెం :7
ఈ టివి 2 వారికోసం వాలెంటైన్స్ డే సందర్భంగా నా రెండవ పాట
తన ప్రియురాలు కొన్ని రోజుల తర్వాత తన కోసం తిరిగి వచ్చిన క్షణం లో
ప్రియుడు పాడుకునే ఈ పాట
***********************************************************************************************************************************
నిన్ను చూడగానే గుండెస్పందన మొదలాయె
నీ రాకతోటే మనసుహాయి తెలిసిందే
నీ వాలుచూపుల్లో నా తలపు మురిసిందే
నీ చిరునవ్వుల్తో నా గుండెగంట మ్రోగిందే
ఓ చెలీ ఓ చెలీ ఓ చెలీ .......... ... వెన్నెల్లో జాబిల్లి
ఓ చెలీ ఓ చెలీ ఓ చెలీ........... ... నా కన్నుల్లో దీవాళీ //నిన్ను చూడగానే //
చరణం 1 :-
కలవరింతలకు కాలం చెల్లిపోయే
కమ్మనైన నీ శ్వాస గంధమై చేరే
ఏ తుళ్ళింతలు ఇక నన్ను చేరలేవే
నీ అడుగుల సవ్వడే నా గమ్యమాయే
నీ పిలుపు చాలు అది పంచదార పలుకు
నీ ఉనికి చాలు అది నన్ను మేలుకొలుపు

చరణం 2: -
ఊహలతో ఇక నాకు పనిలేదాయే
ఊపిరల్లే నీ రూపం నాలో నిలచిపోయే
ఎక్కిళ్ల తిప్పలు అవసరం లేదే
ఎదురుగా నువ్వుంటే నాకది చాలే
నీ చూపు చాలు అది వలపులాంటి చినుకు
నీ స్పర్శ చాలు అది నా ప్రాణాన్ని నిలుపు

No comments:
Post a Comment