పాట నెం :60
పల్లవి :-
గుండెను గాయం చేసి బండగా మారావా
ఇబ్బంది నువ్వూ పడుతూ తబ్బిబ్బయ్యావా //గుండె //
కలలోనైనా కావ్యాన్ని చదివేస్తావు నాలా
ఇలలో నీ ముందుంటే బేలచూపులు ఏలా ?
నీతో గడిపిన సావాసాన్ని చంపేస్తున్నావా
నాలో జ్వాలను రగిలించి జారిపోతావా //గుండె //
చరణం 1:
ఆ చినుకే చెప్పింది మన నడకల గమనాన్ని
ఆ మేఘం చూసింది మన వలపుల గమకాన్ని
మన మనసులు మమేకమై రుచి చూసిన ప్రణయాన్ని
మరలా వద్దకు రావొద్దంటూ నిందించకు నా ప్రేమని
నీవే నేనై నేనే నీవై నాలో సగమై నిలచిన ప్రాణమా //గుండె //
చరణం 2:
ఆ చిరుగాలి పాడింది తన స్వరాన్ని శృతి కలిపి
ఆ సెలయేరు పారింది మన సవ్వడితో కలిసి
మన హృదయం సరాగమై కురిసిందే అనురాగమే
నువ్వూ ఓ దూరమై మిగిలిందే ఆలాపనే

No comments:
Post a Comment